Mobile Explosion:మొబైల్ పేలడంతో తీవ్ర గాయాలు
ఉత్తరప్రదేశ్ లో మొబైల్ పెళ్లి వ్యతి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రీమియం బ్రాండ్ మొబైల్ ఫోన్ పేలడంతో అలీఘర్‌లో 47 ఏళ్ల వ్యాపారవేత్త గాయపడ్డాడు
- By Praveen Aluthuru Published Date - 09:33 AM, Mon - 14 August 23

Mobile Explosion: ఉత్తరప్రదేశ్ లో మొబైల్ పెళ్లి వ్యతి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రీమియం బ్రాండ్ మొబైల్ ఫోన్ పేలడంతో అలీఘర్‌లో 47 ఏళ్ల వ్యాపారవేత్త గాయపడ్డాడు. అతను మూడు సంవత్సరాల క్రితం ఓ మొబైల్ ఫోన్ కొన్నాడు. మొబైల్ జేబులో ఉన్నప్పుడు వేడెక్కిపోయిందని, దానిని బయటకు తీసి చూడగా మొబైల్ లో నుంచి పొగలు వచ్చాయని బాధితుడు చెప్పాడు. దీంతో కొద్దిసేపటికే పెద్ద శబ్దంతో పేలి రెండు ముక్కలు అయిందని చెప్పాడు. గాయపడ్డ ఆ వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని ఎడమ బొటనవేలు మరియు తొడపై గాయాలయ్యాయి. కాగా సదరు కంపెనీపై కేసు బుక్ చేశారు పోలీసులు. విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే మొబైల్ ఫోన్ పేలడం ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి ఘటనలు మరెన్నో జరిగాయి. గత ఏడాది డిసెంబర్‌లో మధుర జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలుడు చైనీస్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ గేమ్ ఆడుకుంటుండగా పేలడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Also Read: Tirumala Cheetah Trapped : తిరుమలలో చిన్నారిని చంపిన చిరుత చిక్కింది