Tirumala Cheetah Trapped : తిరుమలలో చిన్నారిని చంపిన చిరుత చిక్కింది
Tirumala Cheetah Trapped : తిరుమల కాలి నడక మార్గంలో రెండు రోజుల క్రితం ఓ చిన్నారి ప్రాణం తీసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది.
- Author : Pasha
Date : 14-08-2023 - 9:23 IST
Published By : Hashtagu Telugu Desk
Tirumala Cheetah Trapped : తిరుమల కాలి నడక మార్గంలో రెండు రోజుల క్రితం ఓ చిన్నారి ప్రాణం తీసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. ఆ చిరుత ఆదివారం అర్ధరాత్రి బోనులో చిక్కిందని తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) అటవీ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల పాటు శ్రమించిన అధికారులు ఎట్టకేలకు చిరుతను బంధించారు. అధికారులు అంచనా వేసినట్టుగానే.. చిన్నారి ప్రాణం తీసిన ప్రాంతానికే చిరుత ఆదివారం అర్ధరాత్రి మళ్లీ వచ్చి అక్కడ అమర్చిన ఒక బోనులో చిక్కింది. చిరుత చిక్కడంతో (Tirumala Cheetah Trapped) టీటీడీ అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.ఈనేపథ్యంలో ఇవాళ టీటీడీ కొత్త ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి హైలెవల్ కమిటీతో సమావేశం కానున్నారు. తిరుమల భక్తుల భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు.
Also read : Today Horoscope : ఆగస్టు 14 సోమవారం రాశి ఫలితాలు.. వారు అప్పులు తీసుకోవడం మంచిది కాదు