Umesh Yadav: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఉమేష్ యాదవ్ కు గాయం..?
భారత జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ (Umesh Yadav) స్నాయువు గాయంతో పోరాడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఉమేష్ యాదవ్‌ను దూరం చేయక తప్పదని భావిస్తున్నారు.
- Author : Gopichand
Date : 29-04-2023 - 10:38 IST
Published By : Hashtagu Telugu Desk
IPL 2023 సీజన్‌లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అదే సమయంలో దీని తర్వాత భారత క్రికెటర్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (World Test Championship final)కు సిద్ధమవుతారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి ఓవల్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ముందు ఆస్ట్రేలియా సవాల్ నిలవనుంది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ (Umesh Yadav) స్నాయువు గాయంతో పోరాడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఉమేష్ యాదవ్‌ను దూరం చేయక తప్పదని భావిస్తున్నారు. ఇదే జరిగితే టీమ్‌ఇండియాకు పెద్ద దెబ్బే.ఐపీఎల్‌లో ఉమేష్
యాదవ్ రాబోయే మ్యాచ్‌లలో ఆడతాడా?
ఉమేష్ యాదవ్ IPL 2023 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ గాయపడ్డాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ తప్పుకోవాల్సి వచ్చింది. అయితే, ఉమేష్ యాదవ్ IPL 2023 సీజన్‌లోని రాబోయే మ్యాచ్‌లలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడతాడా అనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియలేదు. అయితే అతను గాయం నుండి కోలుకుంటే కోల్‌కతా నైట్ రైడర్స్ జెర్సీలో కనిపించవచ్చు.
బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ తర్వాత ఇప్పుడు ఉమేష్ యాదవ్
ఉమేష్ యాదవ్ గాయం భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు శుభవార్త కాదు. ఎందుకంటే జట్టు ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లకు గాయాలతో పోరాడుతోంది. భారత జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు గాయం కారణంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడరు. ప్రస్తుతం భారత జట్టు మేనేజ్‌మెంట్ ఈ గాయపడిన ఆటగాళ్ల స్థానంలో ప్లేయర్స్‌ను భర్తీ చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉమేష్ యాదవ్ గాయపడడం తలనొప్పిని పెంచే వార్తే. జూన్ 7 నుంచి ఓవల్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది.