AP Assembly : అసెంబ్లీలో కనిపించని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు.. క్రాస్ ఓటింగ్‌పై బలపడుతున్న అనుమానాలు
ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు వైసీపీలోని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది
- By Prasad Published Date - 11:03 AM, Fri - 24 March 23

ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు వైసీపీలోని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. నిన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేశారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఈ రోజు వీరద్దరు అసెంబ్లీకి రాకపోవడంతో ఆ ప్రచారానికి బలం చేకూరుతుంది. నిన్న ఓటు వేసిన వెంటనే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బెంగుళూరు వెళ్లిపోయారు. ఉండవల్లి శ్రీదేవి నియోజకవర్గంలోనే ఉన్నట్లు సమాచారం. అయితే నిన్న జరిగిన ప్రచారాన్ని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఖండించారు. తాను దళిత ఎమ్మెల్యే అనే చిన్న చూపుతో తనపై మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఆమె ఆరోపించారు. అయితే ఈ రోజు అసెంబ్లీకి హాజరుకాకపోవడంతో వీరిద్దరు క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారని వైసీపీ ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతుంది