Srinagar News: జమ్మూలో విషాదం, ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని దక్సమ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.
- By Praveen Aluthuru Published Date - 03:44 PM, Sat - 27 July 24

Srinagar News: జమ్మూకశ్మీర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం పాలయ్యారు. స్థానికంగా ఈ వార్త అందర్నీ విషాదంలోకి నెట్టింది.
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని దక్సమ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రజలందరూ కిష్త్వార్ నివాసితులు. సమాచారం ప్రకారం బాధిత కుటుంబం కిష్త్వార్ నుండి సింథాన్ టాప్ మీదుగా మార్వా వైపు వెళుతోంది. ఈ క్రమంలో వాళ్ళు ప్రయాణించే వాహనం ప్రమాదానికి గురైంది.
ప్రమాదానికి గురైన ఇంతియాజ్ వృత్తిరీత్యా పోలీసు. దీంతో పాటు ఐదుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు కారులో ఉన్నారు. దీంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలు ఇంతియాజ్, అతని భార్య అఫ్రోజాగా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మరణించిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాద తీరుపై విచారణ చేపట్టనున్నారు.
Also Read: Harirama Jogaiah Letter : మళ్లీ పెన్ను..పేపర్ పట్టుకున్న జోగయ్య..