Viral Video: చిన్నారుల గొప్ప మనసు.. మహిళకి సాయం చేసిన వీడియో వైరల్!
సాధారణంగా మనం రోడ్డుపై నడుచుకుంటూ రోడ్డుకి ఇరువైపులా బండ్లపై కాయగూరలు లేదంటే పండ్లు ఇలా రకరకాల
- By Anshu Published Date - 05:35 AM, Sat - 13 August 22

సాధారణంగా మనం రోడ్డుపై నడుచుకుంటూ రోడ్డుకి ఇరువైపులా బండ్లపై కాయగూరలు లేదంటే పండ్లు ఇలా రకరకాల బిజినెస్ పెట్టుకుని ఉంటారు. అయితే ఇటువంటివారు ఒకే చోట ఉండకుండా వ్యాపారం బాగా జరగాలి అని అటు వెళ్తూ బండిని తోసుకెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఆ తోపుడు బండిని ఎత్తు మిట్ట ప్రాంతాలలో తోసుకొని వెళ్లడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటప్పుడు చాలా మంది అటువంటి వారికి సహాయం చేస్తూ ఉంటారు. తాజాగా ఇద్దరు చిన్నారులు కూడా అలాంటి పనిచేయడంతో నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒక రోడ్డుపై తోపుడు బండిని తోసుకుంటూ పండ్లు అమ్ముకుంటూ వెళ్తోంది. అలా వెళుతూ ఉంటే ఓ వీధిలో రోడ్డు చాలా ఎత్తుగా ఉంది. ఎలా తోయాలా అని ఆమె అక్కడ ఆగి చూడటం మొదలుపెట్టింది. పైకి తోసేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టింది. ఇక ఆ వీధి వెంట చాలామంది వెళ్తున్నా కూడా అది చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు. ఇంతలోనే ఇద్దరు చిన్నారులు అక్కడికి వచ్చి సదరు పండ్ల బండి మహిళ ఇబ్బందిపడుతుండటం చూసి సహాయం చేశారు. ఆ చిన్నారులలో ఒక అబ్బాయి బండి ముందు నుంచి పట్టుకొని లాగుతుండగా మరొక అమ్మాయి ఆ మహిళతో పాటు వెనుక వైపు నుంచి తోస్తోంది.
आपकी डिग्री सिर्फ़ एक काग़ज़ का टुकड़ा है, अगर वो आपके व्यवहार में ना दिखे तो। pic.twitter.com/eHsuTYOGrh
— Mahant Adityanath 2.0🦁 (@MahantYogiG) August 8, 2022
అలా ముగ్గురు కలిసి ఆ బండిని ఆ ఎత్తు ప్రాంతానికి తీసుకొని వస్తారు. ఆ మహిళ చిన్నారులకు కృతజ్ఞతతో ఇద్దరికీ ఒక్కొక్క అరటి పండు ఇస్తుంది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన నెటిజన్స్ సదరు చిన్నారులు చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఆ మహిళ కష్టపడుతుండగా చూసి చూడనట్టుగా వెళ్లిపోయిన వారిని తప్పుబడుతూ వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ చిన్నారులను చూసి సిగ్గుపడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.