TTD : నయనతార దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న టీటీడీ..!!
నయనతార, విఘ్నేశ్ దంపతులు...తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. తిరుమల కొండపై శ్రీవారి ఆలయం చుట్టున్న మాడవీధుల్లో తిరిగారు.
- By hashtagu Published Date - 09:42 PM, Fri - 10 June 22

నయనతార, విఘ్నేశ్ దంపతులు…తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. తిరుమల కొండపై శ్రీవారి ఆలయం చుట్టున్న మాడవీధుల్లో తిరిగారు. ఈ సందర్భంగా విఘ్నేశ్ చెప్పులు లేకుండా నడిచినా…నయనతార మాత్రం చెప్పులతోనే మాడవీధుల్లో తిరిగారు. అంతేకాదు శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారానికి సమీపంలోనే వారు ఫొటో షూట్ లో పాల్గొన్నారు. ఈవిధంగా తిరుమల పవిత్రతకు నయనతార దంపతులు భంగం కలిగించేలా వ్యవహరించిన తీరుపై విమర్శలు రేకెత్తుతున్నాయి.
కాగా ఈ వ్యవహారంపై టీటీడీ స్పందించింది. శ్రీవారి ఆలయం సమీపంలో నయనతార దంపతుల ఫొటోషూట్ పై టీటీడీ ఆగ్రహించింది. నయనతార కాళ్లకు చెప్పులతో మాడవీధుల్లో నడవడం దురద్రుష్టకరమని వ్యాఖ్యానించింది. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన నయనతార దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ టీటీడీ ప్రకటించింది.