TTD : నేడు శ్రీవారి అర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లు నేడు(బుధవారం) టీటీడీ విడుదల చేయనుంది
- By Prasad Published Date - 09:42 AM, Wed - 24 August 22

తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లు నేడు(బుధవారం) టీటీడీ విడుదల చేయనుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన టికెట్లను బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ అందుబాటులో ఉంచనుంది. అలాగే అదే నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జిత సేవా టికెట్లను మధ్యాహ్నం 2 గంటలకు లక్కీ డిప్ ద్వారా కేటాయించనుంది. అక్టోబర్ నెలకు సంబంధించి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణ తదితర సేవా టికెట్ల కోట, వాటి దర్శన కోటా టికెట్లను సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనుంది.