TTD Deputy EE Sri Lakshmi: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్
హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని బుధవారం అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు
- Author : Praveen Aluthuru
Date : 29-05-2024 - 6:43 IST
Published By : Hashtagu Telugu Desk
TTD Deputy EE Sri Lakshmi: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని బుధవారం అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మే 25న తిరుపతిలోని ఎన్జీవో కాలనీలో వెంకట శివారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం శివారెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శివారెడ్డి నివాసం ఎదుట బైక్‌తో ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. శివారెడ్డి తలపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా ఉంటున్న ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న శివారెడ్డి, శ్రీలక్ష్మిల మధ్య గతంలో చాలాసార్లు గొడవలు జరిగాయి. వీరిని అదుపులోకి తీసుకున్న అలిపిరి పోలీసులు ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ వీడియో ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
Also Read: AP : దుకాణం సర్దుకోవాల్సిందే అని వైసీపీ ఫిక్స్ అయ్యిందా..?