AP : దుకాణం సర్దుకోవాల్సిందే అని వైసీపీ ఫిక్స్ అయ్యిందా..?
వైసీపీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించటం చూస్తుంటే వారికి ఎలాగు పడలేదు కాబట్టి కూటమికి ఓట్లు దక్కకూడదన్న ఉద్దేశమే అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు
- Author : Sudheer
Date : 29-05-2024 - 6:26 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ఉత్కంఠ నెలకుందో తెలియంది కాదు..ఈ ఫలితాల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. 174 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు సంబదించిన పోలింగ్ ఫలితాలు జూన్ 04 న వెల్లడి కాబోతున్నాయి. ఈ ఫలితాలపై కూటమి నేతలు ధీమా గా ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా కూటమికే మద్దతు ఇచ్చారని చెపుతున్నారు. కానీ వైసీపీ నేతల్లో మాత్రం పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ భయం రోజు రోజుకు ఎక్కవుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే ఏయే వర్గాలు ఎవరికి అండగా ఉన్నాయన్న అంశంపై ఓ అవగాహనకు రాగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మనకు పడలేదన్న క్లారిటీకి వైసీపీ వచ్చినట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది. దీంతో ఈ ఓట్లు ఎలాగైనా చీలిపోవాలన్న ఉద్దేశంతో రూల్స్ వెతికే పనిలో పడింది వైసీపీ. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల విషయంలో కొన్ని చోట్ల రిటర్నింగ్ ఆఫీసర్లు తమ సీల్ వేయలేదు. దీంతో అవి చెల్లుతాయా లేదా అన్న గందరగోళం ఉండగా, అవి చెల్లుబాటు అవుతాయని ఈసీ స్పష్టత ఇచ్చింది. అవి ఎవరికి పడతాయో ఎవరికీ తెలియదు. కానీ సీల్ లేదన్న కారణంగా ఓట్లు మురిగిపోకూడదన్న ఉద్దేశంతో ఈసీ నిర్ణయం తీసుకుంది. కానీ, అలా ఎలా నిర్ణయం తీసుకుంటారు… ఆ ఓట్లు చెల్లుబాటు కాకుండా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ వైసీపీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించటం చూస్తుంటే వారికి ఎలాగు పడలేదు కాబట్టి కూటమికి ఓట్లు దక్కకూడదన్న ఉద్దేశమే అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Also : T20 World Cup Rules: టి20 ప్రపంచకప్ లో ఐపీఎల్ నియమాలు చెల్లవ్