TSRTC Special Buses: మహిళలు, విద్యార్థినిలకు ‘టీఎస్ఆర్టీసీ’ ప్రత్యేక బస్సులు!
తెలంగాణ ఆర్టీసీ సంస్థ మహిళలు, విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులు నడుపబోతోంది.
- Author : Balu J
Date : 04-03-2023 - 12:32 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక పథకాలు, ఆకర్షించే స్కీములతో ప్రజలను, ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు చేరువ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అనునిత్యం వినూత్నమైన పథకాలకు శ్రీకారం చుడుతోంది. ప్రజలకు మేలు చేసే అనేక పథకాలను తీసుకువస్తోంది. తాజాగా టీఎస్ఆర్టీసీ (TSRTC) మరో అద్భుతమైన స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.
గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలోని విద్యార్థినులు, మహిళలకు శుభవార్త (Good News) చెప్పింది. వారి సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ. రద్దీ సమయాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా లేడీస్ స్పెషల్ బస్సులను నడుపుతోంది. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని విద్యార్థులు, మహిళలు క్షేమంగా తమ గమ్యస్థానాలను చేరుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరింది.