Trisha :రాజకీయ అరంగేట్రంపై స్పందించిన త్రిష
తనకసలు రాజకీయాల (Politics) గురించి ఏమాత్రం తెలియదని స్పష్టం చేశారు.
- By Maheswara Rao Nadella Published Date - 03:01 PM, Mon - 26 December 22

దక్షిణాది నటి త్రిష (Trisha) రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఇటీవల కథనాలు వస్తున్నాయి. ఇటీవల ఆమె నటించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం రిలీజ్ కాగా, ఆ తర్వాత అనేక ప్రాజెక్టులు ఆమెను వెతుక్కుంటూ వచ్చినా, ఆమె తిరస్కరించారు. త్రిష రాజకీయాల్లోకి వెళుతున్నందునే ఈ సినిమాలను అంగీకరించలేదంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారంపై త్రిష (Trisha) స్పందించారు. తన కొత్త చిత్రం ‘రాంగీ’ ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొన్న త్రిష మీడియాతో మాట్లాడుతూ… జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. తనకసలు రాజకీయాల గురించి ఏమాత్రం తెలియదని స్పష్టం చేశారు. తన పొలిటికల్ ఎంట్రీ అంటూ వస్తున్న కథనాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయాలు తనకు నచ్చవని త్రిష పేర్కొన్నారు.
Also Read: 5G Services : విమానాశ్రయానికి సమీపంలో ఉండే వారికి 5జీ సేవలు ఇప్పట్లో లేనట్టే!