Unknown Dead Bodies : అయ్యో పాపం.. ఆ 101 డెడ్ బాడీస్ ఎవరివో
మరో 101 మృతదేహాలు ఎవరివి.. ?(Unknown Dead Bodies) వాళ్లంతా ఎక్కడి వాళ్ళు ? అనేది ఇంకా అధికారులు గుర్తించలేకపోతున్నారు.
- Author : Pasha
Date : 06-06-2023 - 9:53 IST
Published By : Hashtagu Telugu Desk
Unknown Dead Bodies : ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మంది ప్రాణాలు కోల్పోగా, 1000 మందికిపైగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనలో మరో 101 మృతదేహాలు ఎవరివి.. ?(Unknown Dead Bodies) వాళ్లంతా ఎక్కడి వాళ్ళు ? అనేది ఇంకా అధికారులు గుర్తించలేకపోతున్నారు. ఈవిషయాన్ని తూర్పు మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ రింకేశ్ రాయ్ మీడియాకు తెలిపారు. ఒడిశాలోని వివిధ ఆసుపత్రుల్లో సుమారు 200 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు.
Also read : Another Train Accident : ఒడిశాలో మరో రైలు ప్రమాదం
భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్ అమృత్ కులంగే మీడియాతో మాట్లాడుతూ.. “భువనేశ్వర్‌లో ఉంచిన మొత్తం 193 మృతదేహాలలో 80 మృతదేహాలను ఇప్పటికే గుర్తించారు. 55 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్ప్‌లైన్ నంబర్ 1929కు 200 కంటే ఎక్కువ కాల్స్ వచ్చాయి. వాటి ప్రకారం అధికారులు మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగిస్తున్నారు” అని వివరించారు.