Another Train Accident : ఒడిశాలో మరో రైలు ప్రమాదం
Another Train Accident : ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. బార్గా జిల్లా (Bargarh district)లో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
- By Pasha Published Date - 11:20 AM, Mon - 5 June 23

Another Train Accident : ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. బార్గర్ జిల్లా (Bargarh district)లో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. డుంగూరి నుంచి బార్గర్ వైపు సున్నపురాయి లోడ్ తో వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన 5 బోగీలు బార్గర్ జిల్లా సమర్దర్హ గ్రామం సమీపంలో పట్టాలు తప్పాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
Also read : Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో విమాన ధరలకు రెక్కలు
కాగా, ఒడిశాలో బాలాసోర్ జిల్లాలో శుక్రవారం (జూన్ 2న) రాత్రి 7 గంటలకు మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను మర్చిపోక ముందే సోమవారం బార్గర్ జిల్లాలో మరో గూడ్స్ ట్రైన్ (Another Train Accident) పట్టాలు తప్పడం గమనార్హం.