TS : హైదరాబాద్ లో విషాదం…ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్..!!
హైదరాబాద్ లో చందానగర్ లో విషాద ఘటన చోటచేసుకుంది.
- Author : hashtagu
Date : 17-10-2022 - 9:34 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ లో చందానగర్ లో విషాద ఘటన చోటచేసుకుంది. చందానగర్ లోని పాపిరెడ్డి కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్ చేసుకున్నారు. బాధిత కుటుంబం రాజీవ్ గ్రుహ కల్పలో నివాసం ఉంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు…ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులు ఎవరన్నది ఇంకా స్పష్టత లేదు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలా లేదా ఆర్థికపరమైన అంశాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.