Toofan Alert : తెలుగు రాష్ట్రాలపై ముంచుకొస్తున్న తుపాను
Toofan Alert : రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది
- By Sudheer Published Date - 10:19 AM, Mon - 19 May 25

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను (Toofan ) కారణంగా దక్షిణాది రాష్ట్రాలపై వాతావరణ శాఖ(IMD) భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. మే 19 నుండి 23 వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (Telugu States ) రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా మే 21 నాటికి తుపాను కర్ణాటక తీరాన్ని తాకే అవకాశం ఉండటంతో తీరప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వర్షాల్లో బయటకు రాకూడదని సూచించింది.
Anasuya : మా ఇంట్లోకి హనుమంతుడు వచ్చాడు.. అనసూయ పోస్ట్ వైరల్..
ఇప్పటికే బెంగళూరులో గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడం, ఇంట్లోకి నీరు ప్రవేశించడం, ట్రాఫిక్ జామ్‌లు, చెట్ల విరిగిపడటం వంటి ఘటనలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మే నెలలో ఇలా వర్షాలు కురవడం అరుదైనదే. ఈ తుపాను ప్రభావం బెంగళూరుతోపాటు మహారాష్ట్రలోని ముంబై, థానే, రాయ్‌గఢ్ వంటి ప్రాంతాలపై కూడా ఉంది. ఈ ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసి, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే శ్రీకాకుళం, కోనసీమ, కడప తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, హన్మకొండ వంటి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది. గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించబడింది.