Anasuya : మా ఇంట్లోకి హనుమంతుడు వచ్చాడు.. అనసూయ పోస్ట్ వైరల్..
తాజాగా గృహప్రవేశంలో పూజలు నిర్వహించిన ఫొటోలు షేర్ చేసి ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది అనసూయ.
- By News Desk Published Date - 09:42 AM, Mon - 19 May 25

Anasuya : యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ ప్రస్తుతం నటిగా దూసుకుపోతుంది. సినిమాలతో, పలు టీవీ షోలతో బిజీగా ఉంది అనసూయ. ఇటీవల అనసూయ ఖరీదైన ఇల్లు కట్టించుకొని కొత్తింట్లోకు గృహప్రవేశం చేసింది. గృహప్రవేశం ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. తాజాగా గృహప్రవేశంలో పూజలు నిర్వహించిన ఫొటోలు షేర్ చేసి ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది అనసూయ.
గృహప్రవేశం ఫొటోలు షేర్ చేసి.. ఈ ఫోటోల వెనుక ఉన్న విషయాన్ని మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ నెల 3న మా కొత్తింట్లో కొన్ని హోమాలు, పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతం, మరకలింగ రుద్రాభిషేకం జరిపాము. మా కొత్తింటికి సంజీవని అని పేరు పెట్టుకుందాం అని మా గురువుగారిని అడిగితే ఆయన శ్రీరామ సంజీవని అని పెట్టమన్నారు. దానికి మేము సంతోషించాము. మేము వేరే పూజ చేయడానికి పక్కకు వెళ్తే మా గురువు గారు హోమం చేసారు. కాసేపాగి హోమం దగ్గరకు వస్తే మా గురువు గారు హోమానికి సంబంధించి ఓ ఫోటో చూపించి అనసూయ ఆంజనేయుడు వచ్చాడు అని అన్నారు.
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్న దగ్గర్నుంచి నేర్చుకొన్న గొప్ప విషయాల్లో ఒకటి సంతోషం, బాధ, దుఃఖం, అనారోగ్యం, భయం, ఆందోళన.. అన్నింటిలో జై హనుమాన్ అని తలుచుకోవడమే. మా నాన్న తర్వాతగా హనుమంతుడిని నాన్నగా భావిస్తాను. ఈ విషయం నా దగ్గరి వాళ్లందరికీ తెలుసు. నా పెద్ద కొడుక్కు శౌర్య అని ఆయన పేరే పెట్టుకున్నాము. అగ్ని దేవుడు ముక్కోటి దేవతలకు వార్తాహరుడు అని అంటారు. అందుకే ఏ దేవుడికి గట్టిగా ఏం చెప్పాలన్నా హోమం ద్వారానే చెప్పుకుంటాం. ఈ విధంగా ఆ రోజు హనుమాన్ మా ఇంటిని, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. అందరూ భక్తి భావంతో ఉండరు. కానీ నేను అనుభవించిన దాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్నా. మీలో కొంతమంది నమ్మినా నమ్మకపోయినా ప్రహ్లాదుడు చెప్పినట్టు ఇందుగలడందులేడని సందేహము వలదు ఎందెందు వెదకి చూసిన అందందేగలడు అని రాసుకొచ్చింది అనసూయ.
దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారగా అనసూయ అదృష్టవంతురాలు, అనసూయ ఇంటి ఓపెనింగ్ కి హనుమంతుడి వచ్చాడు అని కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ ఇంట్లో జరిగిన హోమంలో హనుమాన్ ప్రతిమ కనిపించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read : Multistarrer : మల్టీస్టారర్ మూవీ చేయబోతున్న మాటల మాంత్రికుడు ..?