Tomato Farmer Murder : అన్నమయ్య జిల్లాలో టమాటా రైతు దారుణ హత్య
పాతకక్షలు, రాజకీయ కక్షలతో హత్యలు జరుగుతుంటాయని విన్నాం.. కానీ ఈ మధ్య టమాటా రైతుల హత్యలు పెరిగిపోయాయి.
- Author : Prasad
Date : 17-07-2023 - 11:01 IST
Published By : Hashtagu Telugu Desk
పాతకక్షలు, రాజకీయ కక్షలతో హత్యలు జరుగుతుంటాయని విన్నాం.. కానీ ఈ మధ్య టమాటా రైతుల హత్యలు పెరిగిపోయాయి. టమాటా ధర అమాంతం పెరిగిపోవడంతో వాటిని దోచుకెళ్లి కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో టమోటా రైతు దారుణ హత్యకు గురైయ్యాడు. నవాబుకోటకు చెందిన భత్తల మధుకర్ రెడ్డి టమోటా పొలంలో టెంటు వేసుకుని నిద్రిస్తుండగా దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.టమోటాలను దొంగతనం చేసేందుకు రైతును హత్య చేసినట్లు తెలుస్తోంది. రైతును హత్య చేసిన అనంతరం అక్కడి నుండి దుండగులు పరారైయ్యారు. ఇవాళ ఉదయం పొలం వైపు వెళ్తున్న స్ధానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్ధలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.