Hyderabad: విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీయాలి: రవీందర్ రెడ్డి
ప్రతి సంవత్సరం ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత దినోత్సవం జరుపుతామని అని రవీందర్ రెడ్డి తెలిపారు.
- Author : Balu J
Date : 22-04-2023 - 5:33 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21 న ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత దినోత్సవం జరుపుతామని అని Director ACIC-CBIT and Principal CBIT పి రవీందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులలో సృజనాత్మక కు వెలికి తేయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. సృజనాత్మకత, ఆవిష్కరణల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం, ఆలోచనలను ప్రోత్సహించడం ముఖ్య లక్ష్యమని ఎసిఐసి సిబిఐటి సిఈఓ అన్నే విజయ అన్నారు.
రవిశంకర్, అబ్దుల్ , ఎసిఐసి – అతీక్ హుస్సేన్, ఈన్ను షేక్, వైష్ణవి రెడ్డి, ఖదీజా కార్యక్రమ నిర్వహణలో భాగమయ్యారు. అశోక్ గొర్రె, చంద్రశేఖర్ ఎన్, ఉదయ్ భాస్కర్, సూరజ్ వి మెయ్యూర్; డాక్టర్ మెండె శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమానికి నూతన ఆవిష్కర్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులతో సహా 250 అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.