Calcutta HC: టీఎంసీకి షాకిచ్చిన కలకత్తా హైకోర్టు
టీఎంసీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 5న బిజెపి నేతల నివాసానలను ముట్టడిస్తామని ప్రకటించారు టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ.
- Author : Praveen Aluthuru
Date : 31-07-2023 - 2:53 IST
Published By : Hashtagu Telugu Desk
Calcutta HC: టీఎంసీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 5న బిజెపి నేతల నివాసానలను ముట్టడిస్తామని ప్రకటించారు టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ. ఈ మేరకు కలకత్తా హైకోర్టు అభిషేక్ బెనర్జీపై నిషేధం విధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్ 5న సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా ఎలాంటి నిరసనలు చేపట్టరాదని, ట్రాఫిక్ సమస్యలు సృష్టించవద్దని తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: Tomato: రూ. 21 ఒక్క లక్షలు విలువైన టమోటా లారీ మాయం.. అసలేం జరిగిందంటే?