TTD : టీటీడీలో ఉద్యోగాల పేరిట మోసం.. ముగ్గురుపై కేసు
టీటీడీలో పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూళ్లు చేస్తున్న ముగ్గురిపై....
- By Prasad Published Date - 09:57 AM, Sat - 3 September 22

టీటీడీలో పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూళ్లు చేస్తున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువకుడిని నుంచి లక్ష రూపాయలు వసూలు చేసి ఉద్యోగం రాకపోవడంతో ఆ యువకుడు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ భాగోతం బయటకు వచ్చింది. తిరుమలలో పర్మినెంటు ఉద్యోగాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. లడ్డూ కౌంటర్లు నిర్వహించే కేవీఎం సంస్థ సిబ్బందిపై ఫిర్యాదులు అందాయి. అనంతపురం జిల్లా కొత్తపేటకు చెందిన వ్యక్తి నుంచి సిబ్బంది లక్ష రూపాయలు తీసుకున్నట్టు వెల్లడైంది. మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో, తిరుమల పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.