HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tilak Varma Pulls Off Hilarious Prank On Mumbai Indians Teammates

Tilak Varma: బేబీ ఏబీడీని టీజ్ చేసిన తిలక్ వర్మ

ఐపీఎల్‌ 2022 సీజన్ లో టీమిండియా అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్ తిలక్‌ వర్మ అదరగొడుతున్నాడు. అండర్‌-19 ప్రపంచకప్‌, విజయ్‌ హజారే ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ

  • By Hashtag U Published Date - 04:35 PM, Wed - 4 May 22
  • daily-hunt
Tilak Varma
Tilak Varma

ఐపీఎల్‌ 2022 సీజన్ లో టీమిండియా అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్ తిలక్‌ వర్మ అదరగొడుతున్నాడు. అండర్‌-19 ప్రపంచకప్‌, విజయ్‌ హజారే ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబరిచిన తిలక్ వర్మను, ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో ముంబై ఇండియన్స్‌ రూ. 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. తక్కువ ధరకే అమ్ముడైన ఈ యంగ్‌ క్రికెటర్‌ ముంబై ఇండియన్స్‌కు మాత్రం పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 307 పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

అయితే తాజాగా తిలక్‌ వర్మ సహచర ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను ఆటపట్టించిన ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ముందుగా బిస్కట్లలో క్రీమ్‌ తీసేసిన తిలక్‌ వర్మ.. అందులోటూత్ పేస్ట్‌ను రాశాడు. ఆ తర్వాత మళ్లీ ఆ బిస్కెట్ ప్యాకెట్ ను ఎలా ఉండేదో అలా ప్యాక్ చేసి.. తన తోటి ఆటగాళ్ల దగ్గరికి తినమంటూ అడిగాడు. అయితే తిలక్‌ వర్మ ప్లాన్ తెలియని డెవల్డ్ బ్రెవిస్‌, రిలే మెరెడిత్‌ , టిమ్ డేవిడ్‌, వాటిని లొట్టలేసుకుంటూ తినేశారు. అయితే, వాళ్ళు బిస్కెట్లను పూర్తిగా తిన్న తరువాత అందులో టూత్ పేస్ట్ కలిపిన విషయాన్ని తిలక్ వర్మ వెల్లడించాడు. దాంతో షాకైన ఆ ముగ్గురు ఆటగాళ్లు ఘొల్లున నవ్వేశారు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ అధికారిక ఖాతా ద్వారా అభిమానులతో పంచుకోగా.. ముంబై ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉంటే.. ఐపీఎల్‌-2022లో ఎట్టకేలకు తొలి విజయం అందుకున్న ముంబై జట్టు తమ తర్వాతి మ్యాచ్ ను మే 6న గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2022
  • mumbai indians
  • prank
  • Tilak Varma

Related News

    Latest News

    • Pregnant Women: గర్భధారణ సమయంలో ఆఫీస్‌లో పనిచేసే మహిళలు ఈ విష‌యాలు గుర్తుంచుకోండి!

    • Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

    • DSP Richa: భారత క్రికెట్ జట్టు నుంచి మ‌రో కొత్త డీఎస్పీ!

    • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనలో అపశ్రుతి

    • AR Rahman Concert : రామోజీ ఫిలిం సిటీ లో అట్టహాసంగా జరిగిన రెహమాన్‌ కాన్సర్ట్‌

    Trending News

      • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

      • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

      • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

      • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

      • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd