TS : పోలీసుల అదుపులో ముగ్గురు మహిళా VRAలు..ఆందోళనలో కుటుంబ సభ్యులు..!!
తమ సమస్యలను పరిష్కరం కోసం తెలంగాణలో వీఆర్ఏలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
- Author : hashtagu
Date : 11-10-2022 - 7:43 IST
Published By : Hashtagu Telugu Desk
తమ సమస్యలను పరిష్కరం కోసం తెలంగాణలో వీఆర్ఏలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్దకు వెళ్తున్న ముగ్గురు మహిళా వీఆర్ఎలను ఆర్టీసీ చౌరస్తా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నాలుగు పోలీస్ స్టేషన్లకు తిప్పి…చివరికి ముషిరాబాద్ పీఎస్ కు తరలించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అదుపులోకి తీసుకుని ఇంకా వదిలిపెట్టలేదని…వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటూ మహిళా వీఆర్ఎలను బెదిరిస్తున్నారని తెలిపారు. పై అధికారుల నుంచి ఆర్డర్స్ వస్తేనే వదిలిపెడతామంటూ బెదిరిస్తున్నారని మహిళా వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.