Road Mishap: కృష్ణాజిల్లా చెవుటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
కృష్ణాజిల్లా జి.కొండూరులోని చెవుటూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందరూ.
- Author : Hashtag U
Date : 01-02-2022 - 7:52 IST
Published By : Hashtagu Telugu Desk
కృష్ణాజిల్లా జి.కొండూరులోని చెవుటూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందరూ. ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. విజయవాడ నుంచి తిరువూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సు లో మొత్తం 40మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ కి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ పై ఓవర్లోడ్ ఉండటమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న జి కొండూరు పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్ అంతరాయం తొలగిచారు.