Civil Servants: వీళ్లు సివిల్ సర్విసెంట్లా… ఇలా తిట్టుకుంటున్నారేంటి?
కర్నాటకలో ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య గొడవ చిలిచిలికి గాలివానలా మారింది. ఆ రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఐపీఎస్ డీ
- By Anshu Published Date - 08:27 PM, Mon - 20 February 23

Civil Servants: కర్నాటకలో ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య గొడవ చిలిచిలికి గాలివానలా మారింది. ఆ రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఐపీఎస్ డీ రూపా మౌద్గిల్ ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ కమీషనర్ ఐఏఎస్ రోహిణి సింధూరి మధ్య ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఫైట్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు పబ్లిక్‌గా ఆరోపణలు చేసుకుంటారు. ఆ ఇద్దరు ఆఫీసర్ల ప్రవర్తనపై ఆ రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర కూడా విస్మయం వ్యక్తం చేశారు. ఇద్దరిపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
ఐఏఎస్ సింధూరికి చెందిన కొన్ని ఫోటోలను ఐపీఎల్ రూప తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ముగ్గురు ఐఏఎస్ మేల్ ఆఫీసర్లకు సింధూరి తన ఫోటోలను పంపి సర్వీస్ రూల్స్‌ను బ్రేక్ చేసినట్లు రూప తన పోస్టులో ఆరోపించింది. సింధూరిపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు కూడా రూప తన పోస్టులో పేర్కొన్నది. దీనిపై కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు, సీఎస్ వందితా శర్మకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.
2021 నుం చి 2022 మధ్య ఈ చిత్రాలను ముగ్గురు పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేసినట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే అవినీతి ఆరోపణలూ చేశారు. దీనిపై తాను ముఖ్య మం త్రి బొమ్మై, ప్రధాన కార్యదర్శి వందిత శర్మకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ ఆరోపణలపై రోహిణి అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. రూపా తనపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పరువుకు భంగం కలిగించేందుకు ఆమె నా సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్ స్క్రీన్ షాట్స్ సేకరించారు. నేను వీటిని కొందరికి పంపినట్లు ఆమె అంటున్నారు. ఆ వ్యక్తులెవరో చెప్పా లని కోరుతున్నాను. మానసిక అనారోగ్యం అనేది పెద్ద సమస్య. వైద్యుల సహకారంతో దానిని తగ్గించాల్సిన అవసరం ఉంది. బాధ్యాతయుతమైన స్థానంలో ఉన్నవారు ఆ అనారోగ్యం పాలైతే.. అది మరింత ప్రమాదకరమని
మండిపడ్డారు.