WhatsApp Block : వాట్సాప్‌లో బ్లాకింగ్‌కు ఎన్నో మార్గాలు
WhatsApp Block : కొన్ని సందర్భాలు, కొన్ని కారణాల వల్ల వాట్సాప్‌లో మీరు ఎవరినైనా బ్లాక్ చేయాల్సి వస్తుంటుంది.
- By Pasha Published Date - 08:04 AM, Sat - 9 December 23

WhatsApp Block : కొన్ని సందర్భాలు, కొన్ని కారణాల వల్ల వాట్సాప్‌లో మీరు ఎవరినైనా బ్లాక్ చేయాల్సి వస్తుంటుంది. మీరు వాట్సాప్‌లో ఎవరినైనా బ్లాక్ చేస్తే.. వాళ్లు మీ యాక్టివిటీని చూడలేరు. వాట్సాప్‌లో ఒక వ్యక్తిని బ్లాక్ చేయడానికి అనేక మార్గాలున్నాయి. మీ స్టేటస్, మీ బ్లూ టిక్, మీ చాటింగ్, మీ ప్రొఫైల్ ఇవన్నీ ఇతరులకు కనిపించకుండా చేయడానికి వివిధ రకాల బ్లాకింగ్ మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
నెంబర్ బ్లాక్
మీరు వాట్సాప్‌లో ఎవరి నంబర్‌నైనా బ్లాక్ చేయొచ్చు. ఆ సమయం నుంచి వారికి మీరు మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలను పంపలేరు. మీరు బ్లాక్ చేసిన వాళ్ల నుంచి మీకు కాల్స్, మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు రావు.
స్టేటస్ బ్లాక్
మీరు వాట్సాప్ స్టేటస్ నుంచి ఎవరినైనా బ్లాక్ చేస్తే.. వాళ్లు మీ స్టేటస్‌ను చూడలేరు. మీరు స్టేటస్‌లో షేర్ చేసిన ఫొటోలు, వీడియోలను బ్లాక్‌కు గురైన వారు చూడలేరు.
లాస్ట్ వ్యూ బ్లాక్
మీరు ఆన్‌లైన్‌లో ఉన్న విషయం ఇతరులకు తెలియకూడదంటే వాట్సాప్‌లో ‘లాస్ట్ వ్యూ బ్లాక్’ ఆప్షన్‌ను వాడుకోవాలి. దీనివల్ల మీకు పంపిన మెసేజ్‌లను మీరు చూసినా.. అవతలి వాళ్లకు గ్రీన్ టిక్ రాదు. మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారో లేదో ఎవరూ గుర్తించలేరు.
ప్రొఫైల్ ఫోటో లాక్
మీరు మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫొటో ఎవరికీ కనిపించకుండా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్‌లోని ఫోటో సెట్టింగ్స్‌లోకి వెళ్లి దాన్ని ఎవరు చూడాలి ? ఎవరు చూడకూడదు ? అనేది ఎంపిక చేయవచ్చు. కొన్ని కాంటాక్ట్ నంబర్లను ఎంపిక చేసి.. వారికే కనిపించేలా కూడా(4 Ways – WhatsApp Block) చేయొచ్చు.