Police Case: కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడిన ఎస్ఐ సస్పెండ్
- By Balu J Published Date - 09:05 PM, Fri - 24 May 24

Police Case: మామిడి తోటలో జరిగిన దొంగతనం కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడటంతో పాటు, భూ తగాదా కేసుల్లో బాధితులకు కాకుండా వారి ప్రత్యర్థులకు సహకారం అందిస్తుడంతో ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్ లోని భూంపల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న వి. రవికాంత్ ని సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి శ్రీ ఎ. వి. రంగనాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సస్పెండ్ అయిన ఎస్. ఐ రవికాంత్ గతంలో మెదక్ జిల్లా శివం పేట్ ఎస్.ఐగా విధులు నిర్వహించే సమయంలో మామిడి తోటలో యాభై టన్నులకు పైగా మామిడి పండ్లు చోరికి గురైనట్లుగా సంబంధిత మామిడి తోట యజమానురాలు ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్.ఐ తక్షణమే కేసు నమోదు చేయకుండా అలసత్వంతో వ్యవహరించాడు.
ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఎస్.ఐ కొద్ది రోజుల అనంతరం కేసు సివిల్ కేసు పరిధిలోకి వస్తుందని పోలీస్ ఉన్నత అధికారులను తప్పు దోవ పట్టిస్తూ దొంగతనం కేసు ను సివిల్ తగాదా కేసుగా ముగించేందుకు ఎస్. ఐ రవికాంత్ అవకతవకలకు పాల్పడటంతో పాటు భూ తగాదా కేసుల్లో బాధితులకు కాకుండా వారి ప్రత్యర్థులకు సహకారం అందిస్తు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు రావడంతో ఎస్పీ మెదక్ అందజేసిన విచారణ నివేదిక లో ఎస్. ఐ రవికాంత్ పై వచ్చిన ఆరోపణలు నిజ నిర్ధారణ కావడం ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని భూంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్. ఐ గా విధులు వి. రవికాంత్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా మల్టీ జోన్ 1 ఐజిపి ఎ. వి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.