HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >The Reasons Behind The Controversies Of Chinna Jiyar Swamy In Telangana

telangana: చినజీయర్ వివాదాల వెనుక అసలు కారణాలు ఇవి!

తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. రెండు రాజకీయ పార్టీల మధ్య వివాదాలు మామూలే. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా చినజీయర్ స్వామి చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి.

  • Author : Hashtag U Date : 20-03-2022 - 7:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chinna Jeeyar Swamiji Controversyjpg
Chinna Jeeyar Swamiji Controversyjpg

తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. రెండు రాజకీయ పార్టీల మధ్య వివాదాలు మామూలే. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా చినజీయర్ స్వామి చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి. పైగా ఆయన మీడియా ముందుకు వచ్చి వాటిపై వివరణ ఇచ్చుకున్నారు. దీంతో సీన్ మొత్తం మారిపోయింది. ఆదివాసీల విశ్వాసాలపైన, సమ్మక్క-సారక్కలపైన 20 ఏళ్ల కిందట మాట్లాడానని అప్పటి పరిస్థితులను అర్థం చేసుకోవట్లేదన్నది ఆయన ఆరోపణ. కానీ విమర్శకులు ఊరుకోకుండా.. ఆహారపు అలవాట్లపైనా స్వామివారు మాట్లాడారంటూ మరికొన్ని అంశాలను తెరపైకి తెచ్చారు. అసలు ఎప్పుడూ లేనిది ఎందుకు ఇన్ని వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి అంటే.. దానికి సమతామూర్తి విగ్రహం విషయం గురించీ చెప్పాలి.

తెలంగాణలోని ముచ్చింతల్ దగ్గర ఏర్పాటు చేసిన రామానుజాచార్యుల విగ్రహానికి సంబంధించిన అంశాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు, స్వామీజీకి మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగింది. అప్పట్లో.. ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి సీఎం కేసీఆరే తొలి వాలంటీర్ అని జీయర్ స్వామి అన్నారు. మరి అలాంటి కేసీఆరే లేకుండా విగ్రహావిష్కరణ జరిగింది. అదిగో అప్పటి నుంచి జీయర్ స్వామి చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. రామానుజాచార్య విగ్రహ ప్రతిష్ట విషయంలో ఏం జరిగింది? అక్కడి నుంచి చినజీయర్ స్వామివారి విషయంలో వివాదాలు పెరిగాయా? నిజానికి 1000 ఏళ్ల కిందటే దైవాన్ని అందరికీ దగ్గర చేయడంలో రామానుజాచార్యుల ప్రయత్నాన్నీ ఎవరూ కాదనలేరు. అప్పుడే ఆయన అందరికీ సమతా దృక్పథాన్ని బోధించారు. సమసమాజం కోసం రామానుజాచార్యులవారు కృషి చేశారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు.. అక్కడి కార్యక్రమాలకు అధికారంలో ఉన్నవారు వచ్చినప్పుడు, కీలక నేతలు వచ్చినప్పుడు వారికి గౌరవమర్యాదలు ఇవ్వాల్సిందే. వారి విలువైన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి కావలసిన ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రధానమంత్రి వచ్చిన ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు లేదు. అక్కడ మొదలైంది.. అసలు వివాదం.

సీఎం కేసీఆర్ పేరు లేకపోవడంపై చినజీయర్ స్వామి చెప్పిన వెర్షన్ ఏమిటంటే.. ప్రధానమంత్రి కార్యాలయం సూచించిన మేరకే శిలాఫలకం తయారుచేశామని. నిజానికి ఈ ప్రోగ్రామ్ కు ప్రధానమంత్రి కార్యాలయానికి, సంబంధం లేదు. ప్రధాని మోదీ కేవలం అతిథిగానే వచ్చారు. అయినా అతిథిగా వచ్చేవారు కార్యక్రమం ఎలా ఉండాలో నిర్ణయిస్తారా.. ఇక ఇది ప్రధానమంత్రి వచ్చిన ప్రోగ్రామ్ కదా.. దానికి ప్రోటోకాల్ ఉంటుంది కదా అని అనవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకే ప్రోటోకాల్ ఉంటుంది. ప్రైవేటు కార్యక్రమాలకు ఉండదు. అందులోనూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రసక్తే లేదు. ఇక్కడ శిలాఫలకంపై సీఎం కేసీఆర్ పేరు లేకపోవడంపై చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. చినజీయర్ స్వామి చెప్పిన వివరాల ప్రకారం.. పీఎంఓ సూచన మేరకే సీఎం పేరును శిలాఫలకంలో పెట్టలేదు అని అనుకుంటే.. అప్పుడు సీఎం ఆ కార్యక్రమానికి రారు కదా. కానీ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి వలంటీర్ అని అంతకుముందే చెప్పారు. మరి తొలి వలంటీర్ పేరు ఎందుకు పెట్టలేదు. పోనీ సీఎం రారు అని తెలిసీ శిలాఫలకం మీద పేరు పెట్టలేదు అని అనుకున్నా.. కేసీఆర్ రారు అన్న విషయం అందరికీ చాలా ఆలస్యంగా తెలిసింది. కానీ శిలాఫలకం అంతకుముందే సిద్ధమవుతుంది కదా. ఇక్కడ మరో పాయింట్ ని కూడా మర్చిపోకూడదు. ఆ కార్యక్రమం ప్రారంభానికి ఒక్క రోజు ముందు సీఎం కేసీఆర్ స్వయంగా అక్కడికి వెళ్లి ఏర్పాట్లను సమీక్షించారు. అలాంటప్పుడు అనవసరంగా రాజకీయ వివాదాలు చెలరేగడానికి కారణమేంటి?

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాలు, ఇతర అంశాల విషయంలో రాజకీయ నాయకుల ఎంట్రీ తక్కువగా ఉంటుంది. ఒకవేళ పిలిచినా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే వివాదాలు చుట్టుముడతాయి. అందుకే సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ఆరోపణలకు సంబంధించి స్వామీజీయే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ముచ్చింతల్ లో సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన కార్యక్రమంలో అధికారపక్ష నేతలే వచ్చారు. అది కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందే జరిగింది. ఎక్కడా ప్రతిపక్ష నేతలు కనపడలేదు. ఇక తమకు అధికారపక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేదని స్వామీజీ అంటారు. కానీ ఆ కార్యక్రమంలో ఎక్కడా ప్రతిపక్షం వాళ్లు కనపడలేదు. మరి వారిని పిలిచారా..లేక పిలిచినా వాళ్లు రాలేదా అన్నది బయటకు రాలేదు. ఇక యాదాద్రి విషయానికి వస్తే.. తమకు ఎవరితోనూ గ్యాప్ లేదని చెప్పేస్తే సరిపోయేది. కానీ తమతో ఎవరికైనా గ్యాప్ ఉంటే తామేమీ చేయలేమంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించడంతో… సందేహాలు అలుముకున్నాయి. అంటే అక్కడ గ్యాప్ ఉందన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్టయ్యింది. దీంతో చినజీయర్ స్వామి చుట్టూ వివాదాలు నానాటికీ పెరుగుతున్నాయే కాని తగ్గడం లేదు. మరి ఈ పరిణామాలన్నీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పు తీసుకువస్తాయో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • chinajeeyarswamijee
  • controversy
  • telangana

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

    Latest News

    • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

    • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

    • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    Trending News

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd