Viral: రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు, వీడియో వైరల్
- Author : Hashtag U
Date : 21-06-2023 - 1:51 IST
Published By : Hashtagu Telugu Desk
ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్ రైల్వేస్టేషనులో 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. సుమారు వంద మీటర్ల మేర ప్లాట్‌ఫాం మీద అలాగే జారుతూ రైలుతోపాటు ముందుకు వెళ్లాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషనులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎట్టకేలకు ఆ యువకుడు సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. చిన్నగాయం కూడా లేకుండా ఈ ఘటన అనంతరం అతడు లేచి నిలబడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.