Corona Updates: కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది!
- By Balu J Published Date - 11:36 AM, Tue - 25 January 22

గత నాలుగు రోజులుగా కరోనా కేసులు మూడు లక్షలకు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా కొత్త కేసులు మూడు లక్షల కంటే తక్కువగా నమోదయ్యాయి. అంటే భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గిందని చెప్పుకోవాలి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 2,55,874 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 614 మంది మరణించారు. 2,67,753 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.