Accident : డివైడర్ ను ఢీకొన్న కారు. మంటలు చెలరేగి తల్లీ కుమారుడు మృతి
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల వద్ద జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు (Car)
- By Maheswara Rao Nadella Published Date - 03:08 PM, Fri - 16 December 22

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై (NH 65) ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఈ ప్రమాదంలో (Accident) ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేటకు చెందిన సీదెళ్ల ఫణికుమార్(43) కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో (Hyderabad) జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లారు. శుక్రవారం ఉదయం తిరిగి స్వగ్రామానికి కారులో బయలుదేరారు.
ఈ క్రమంలో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల వద్ద జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు (Car) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అనంతరం పల్టీ కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సీదెళ్ల ఫణికుమార్(43), ఆయన తల్లి సీదెళ్ల కరుణ(62) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Bharat Jodo Yatra : 100 రోజులకు చేరుకున్న భారత్ జోడో యాత్ర..!