TGO: డిమాండ్ల పై సీఎస్ శాంతి కుమారి ని కలసిన టీజీఓ సంఘం
- By Balu J Published Date - 09:24 PM, Wed - 15 May 24
![TGO: డిమాండ్ల పై సీఎస్ శాంతి కుమారి ని కలసిన టీజీఓ సంఘం](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/tgo.jpg)
TGO: పెండింగ్ లో ఉన్న పలు డిమాండ్లను తీర్చడంతో పాటు ఇటీవల జరిగిన లోక్-సభ ఎన్నికలలో విధులు నిర్వహించిన అధికారులకు అందించే రెమ్యూనరేషన్లో వ్యత్యాసాలను తొలగించాలని కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కి తెలంగాణ గజిటెడ్ ఆఫిసర్స్ అసోషియేషన్ నేడు అందచేసింది. పెండింగ్ లో ఉన్న డీఏ లను వెంటనే విడుదల చేయాలని, దీర్ఘకాల డిమాండుగా ఉన్న హెల్త్ కార్డులను అందించాలని కోరుతూ గజిట్టెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ, అసోషియేట్ ప్రసిడెంట్ శ్యామ్, జాయింట్ సెక్రెటరీ పరమేశ్వర్ రెడ్డి, ఎం.వీ రమణ, కిషన్, విజయ లక్ష్మి నేతృత్వంలోని ప్రతినిధి బృందం చీఫ్ సెక్రెటరీకి విజ్ఞాపన పత్రం అందచేసింది.
డిమాండ్లు ఇవే
*కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి.
*ఉద్యోగులు, పెన్షనర్లు తోసహా ప్రభుత్వం సమాన కాంట్రిబ్యూషన్తో కూడిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీం ను అమలు చేయాలి.
*పెండింగ్ లో ఉన్న డీఏ లను విడుదల చేయాలి.
*మే మాసంలో పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులు పదోన్నతులు పొందే విధంగా ఎన్నికల కమీషన్ నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.
*2018 నుండి పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బదిలీల జీవో ను ఎత్తివేయాలి.
*ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న ఉద్యోగుల అన్ని బిల్లులను వెంటనే విడుదల చేయాలి.
*రాష్ట్ర విభజన సందర్బంగా ఏపీ కి కేటాయించిన 144 మంది ని తెలంగాణా కు తిరిగి కేటాయించిన ఫైల్ కు సంబంధించి ఎన్నిక్ల సంగం అనుమతి తీసుకోవాలి.
*12 .5 శాతం HOD ఉద్యోగులను సెక్రెటేరియట్ సర్వీసులలోకి తీసుకునే జీవో ను అమలు చేయాలి.
*317 జీవో కు సంబందించిన సమస్యలను పరిష్కరించాలి.
*కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు అదనపు కాడర్ స్ట్రెంత్ ను మంజూరు చేయాలి.
*గోపనపల్లి లోని 101 ఎకరాల హౌస్ సైట్ లకు చెందిన భూమిని అలియానేషన్ చేయాలి.
*రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులకు 24 శతం HRA వర్తింప చేయాలి.
*ఐ.ఆర్ ను 5 శాతం నుండి 20 శాతానికి పెంచాలి.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Maheshwar Reddy : దేశంలోనే భారీ అవినీతి మంత్రి.. పొంగులేటి – బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/maheshwar-reddy-ponguleti.jpg)
Maheshwar Reddy : దేశంలోనే భారీ అవినీతి మంత్రి.. పొంగులేటి – బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి
రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిన్ బ్యాంకు లేదని.. దీనిని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లగించి నడుపుతూ మోసం చేశారని అన్నారు