Andhrapradesh: ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- By HashtagU Desk Published Date - 03:08 PM, Thu - 10 February 22

ఆంధ్రప్రదేశ్‌లో, పదవ తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదలయింది. ఈ క్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి గురువారం ఈ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలు మే 2వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, అండ్ సెకండ్ ఇయర్ పరీక్షల తేదీలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇక కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలు జరగడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో, స్కూళ్ళు, కాలేజ్‌లు కొనసాగుతున్న నేపధ్యంలో టెన్త్, ఇంటర్ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం తాజాగా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.