ArunaReddy: అనుమతి లేకుండానే నా ఫిట్ నెస్ టెస్ట్ వీడియోను తీశారు : తెలుగు జిమ్నాస్ట్ అరుణరెడ్డి
తెలుగు జిమ్నాస్ట్ బుద్దా అరుణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుమతి లేకుండా.. శారీరక ఫిట్ నెస్ వీడియోను రికార్డ్ చేశారంటూ సాయ్ కోచ్ రోహిత్ జైస్వాల్ పై ఆరోపణలు చేశారు.
- By Hashtag U Published Date - 11:16 AM, Sun - 29 May 22
తెలుగు జిమ్నాస్ట్ బుద్దా అరుణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుమతి లేకుండా.. శారీరక ఫిట్ నెస్ వీడియోను రికార్డ్ చేశారంటూ సాయ్ కోచ్ రోహిత్ జైస్వాల్ పై ఆరోపణలు చేశారు. తాను జీఎఫ్ఐ.. అంటే భారత జిమ్నాస్టిక్స్ సమాఖ్య అనుమతితోనే వీడియోను తీస్తున్నారు అని అనుకున్నానని.. కానీ వారి నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఫిట్ నెస్ పరీక్ష వీడియోను కోచ్ తీశారన్నారు. దీంతో ఆమె భారత క్రీడా ప్రాధికార సంస్థ-సాయ్ కు ఫిర్యాదు చేశారు. సాయ్ ఓ కమిటీని నియమించింది. ఇందులో సాయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధిక, కోచ్ కమలేష్, డిప్యూటీ డైరెక్టర్ కైలాష్ మీన ఉంటారు. ఈ ముగ్గురు సభ్యులు బుద్దా అరుణరెడ్డి ఫిర్యాదుపై దర్యాపు చేస్తారు.
కైరో ప్రపంచ కప్ సమయంలో అరుణరెడ్డి మోకాలికి గాయమైంది. దీంతో బాకు ప్రపంచ కప్ లో ఆడాలంటే ఫిట్ నెస్ టెస్ట్ ను ఎదుర్కోక తప్పదు. అందుకే జీఎఫ్ఐ ఆదేశంతో ఆ టెస్ట్ కోసం ఢిల్లీ వెళ్లారు అరుణ. జీఎఫ్ఐ దీని కోసం ఓ కమిటీని కూడా నియమించింది. మార్చి 24న ఆ టెస్ట్ జరిగింది. ఆ సమయంలోనే సాయ్ కోచ్ రోహిత్ జైస్వాల్ వేరొకరితో వీడియో తీయించారన్నారు అరుణరెడ్డి.
బాకు ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టులో అరుణ ఎంపికవ్వలేదు. తరువాత గాయం తీవ్రమైంది. దీంతో అసలు తన ఫిట్ నెస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి వీలుగా.. అంతకుముందు టెస్ట్ సందర్భంగా తీసిన వీడియోతోపాటు మెడికల్ రిపోర్ట్ ను పంపించాలని.. జీఎఫ్ఐ అధ్యక్షుడు సుధీర్ మిట్టల్ కు మెయిల్ చేశారు. అలా చాలాసార్లు చేశారు. దీంతో ఈ నెల 24న ఆయన రిప్లై ఇచ్చారు. వీడియో తీయడానికి అనుమతి లేదని అందులో చెప్పారు. తమ వద్ద ఎలాంటి వీడియో లేదన్నారు.
అరుణరెడ్డి మాత్రం తన ఫిట్ నెస్ సందర్భంగా తనను వీడియో తీశారనడానికి సాక్ష్యాలు ఉన్నాయని కచ్చితంగా చెబుతున్నారు. కమిటీ రిపోర్ట్ మరో వారం రోజుల్లో రానుంది. అందులో ఏం తేలుతుందో చూడాలి.
Related News
Hepatitis : హెపటైటిస్ ఏ ఎందుకు ప్రాణాంతకంగా మారుతోంది.. చికిత్స ఏమిటి?
దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలో ప్రతి కొన్ని నెలలకు ఏదో ఒక వ్యాధి వ్యాప్తి చెందుతుంది.