TRT Notification 2023: టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల.. 5,089 టీచర్ పోస్టులు భర్తీ
తెలంగాణలో టీఆర్టీ నోటిఫికేషన్ (TRT Notification 2023) విడుదల అయింది. గురువారం హైదరాబాద్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్టీ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
- Author : Gopichand
Date : 24-08-2023 - 2:37 IST
Published By : Hashtagu Telugu Desk
TRT Notification 2023: తెలంగాణలో టీఆర్టీ నోటిఫికేషన్ (TRT Notification 2023) విడుదల అయింది. గురువారం హైదరాబాద్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్టీ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ 5,089 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నామని తెలిపారు. 1,523 డిజేబుల్డ్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. సెప్టెంబర్ 15న టెట్ నిర్వహిస్తామని, 27న ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. గురుకులాల్లో ఇప్పటికే 12 వేల పోస్టులు భర్తీ చేశామని పేర్కొన్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 5089 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనిని డీఎస్సీ ద్వారా విడుదల చేస్తున్నామని సబిత తెలిపారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలతో పాటు విధి విధానాలు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. గురువారం టీఆర్టీ నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష నిర్వహించనుంది.
Also Read: Viral : భూమికి చంద్రుడు దూరం అవుతున్నాడా..? కొన్నేళ్ల తర్వాత అసలు చంద్రుడు కనిపించడా..?
ఇప్పటికే 5,310 టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామని చెప్పారు. అన్ని స్థాయిల విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో 3,140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. మిగిలిన ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు.