Omicron: సెంచరీ దిశగా ‘ఓమిక్రాన్’ కేసులు
- By Balu J Published Date - 11:30 AM, Mon - 3 January 22
తెలంగాణలో ఆదివారం ఐదు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి, రాష్ట్రంలో కేసుల సంఖ్య మొత్తం 84కి పెరిగాయి. కొవిడ్ ఎక్కువగా ఉన్న దేశాల్లోనే కాకుండా.. ఇతర దేశాల నుంచి ప్రయాణికుల్లోనూ కొత్త కేసులు బయటపడ్డాయి. కోవిడ్ ప్రభావిత దేశాల నుంచి 163 మంది ప్రయాణికులు ఆదివారం హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారని, వారిలో 14 మంది కోవిడ్‌కు పాజిటివ్ ని తేలిందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి వివిధ దేశాల నుంచి మొత్తం 12,855 మంది ప్రయాణికులు తెలంగాణకు చేరుకున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 274 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం సంఖ్య 6,74,680కి చేరుకుంది. రికవరీ రేటు ఇప్పుడు 98.85 శాతంగా ఉంది.