Bandi Sanjay: హై కోర్టు లో ఊరట
- By hashtagu Published Date - 04:11 PM, Wed - 5 January 22
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హై కోర్టు లో ఊరట లభించింది. బండి సంజయ్ కరీంనగర్ కోర్టు విధించిన 14రోజుల రిమాండును కొట్టివేస్తూ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలనీ జైళ్ల శాఖా అధికారులను తెలంగాణ హై కోర్టు ఆదేశించింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంగిచారని సోమవారం తెలంగాణ పోలీసులు బండి సంజయ్ ను అరెస్టు చేసి కోర్టు లో ప్రవేశపెట్టగా..కరీంనగర్ కోర్టు 14రోజులు రిమాండు విధించింది.