Gadala Srinivasa Rao: ఆ ఎమ్మెల్యేకు విశ్రాంతినిద్దాం, డీహెచ్ వివాదస్పద విమర్శలు
తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాస్ రావు (DH Srinivass Rao) మరోసారి ప్రచారంలోకెక్కారు.
- Author : Balu J
Date : 22-05-2023 - 5:16 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్న తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాస్ రావు (DH Srinivass Rao) మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి నేరుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేసి వార్తల్లోకి ఎక్కారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు సిద్ధమయ్యారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుండగా.. తాజాగా అక్కడి ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు స్థానికంగా అధికార పార్టీలో చిచ్చుపెట్టాయి.
పాల్వంచ మండలంలో పర్యటనలో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనామా వెంకటేశ్వరరావుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆయన చేసిన సేవలు చాలంంటూ.. ఇక విశ్రాంతిని ఇద్దాం అనేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డీహెచ్ రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. ఇప్పటికే తన నియోజకవర్గంలో పలు పనులను ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే డీహెచ్ మాటలు ఇటీవల వివాదాస్పదంగా మారుతుండటం గమనార్హం.
Also Read: Keerthy Suresh: సరైన సమయంలో నా మిస్టరీ మ్యాన్ ను పరిచయం చేస్తా: పెళ్లిపై కీర్తి సురేశ్ రియాక్షన్!