Telangana: రైతు రుణమాఫీ బకాయిలు విడుదల చేసిన ఆర్థికశాఖ
తెలంగాణ రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల హామీలో భాగంగా సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు
- By Praveen Aluthuru Published Date - 09:12 PM, Thu - 3 August 23

Telangana: తెలంగాణ రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల హామీలో భాగంగా సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. నాలుగేళ్లుగా హామీ నిరవేర్చలేదంటూ అధికార పార్టీపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే నిన్న బుధవారం సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ రైతు రుణమాఫీపై ప్రకటన చేశారు. కాగా ఈ రోజు ఆర్ధిక శాఖ అమలు చేసింది. ఈ రోజు గురువారం రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్యన ఉన్న రుణాలు మాఫీ చేసేందుకు గాను ఆర్థికశాఖ రూ.167.59 కోట్లు విడుదల చేసింది. దీని ద్వారా 44,870 మంది రైతులకు లబ్దిచేకూరనుంది.
Also Read: Budget Cars: మార్కెట్ లోకి సరికొత్త హోండా కార్.. ధర, ఫీచర్స్ ఇవే?