Telangana: టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు!
- By Balu J Published Date - 04:09 PM, Fri - 24 December 21

టికెట్ల విషయమై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దూమరం రేగుతోంది. ఒకవైపు హీరోలు, మరోవైపు నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ల విషయమై కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ థియేటర్‌లలో కనిష్ఠ ధర రూ.50 కాగా, గరిష్ఠంగా రూ.150గా టికెట్ ధరను (జీఎస్టీ అదనం) నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌ల్లో మినిమం టికెట్ ధర రూ.100+జీఎస్‌టీ, గరిష్ఠంగా రూ.250+జీఎస్‌టీగా ధరను ఖరారు చేశారు. సింగిల్ థియేటర్లలో స్పెషల్ రిక్లైనర్ సీట్లకు రూ.200+ జీఎస్‌టీ.. మల్టీప్లెక్స్‌లలో రూ.300+ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్‌లలో రూ.5, నాన్ ఏసీకి రూ.3 వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.