HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Telangana Congress Begins Preparations For Munugodu By Election

Munugodu By-Election : కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఓడించేందుకు వ్యూహాలు ర‌చిస్తున్న టీకాంగ్రెస్‌

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే

  • Author : Prasad Date : 03-08-2022 - 7:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Congress
Telangana Congress

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న్ని ఉప ఎన్నిక‌ల్లో ఓడించేందుకు తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు ర‌చిస్తుంది. రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంట‌నే మునుగోడు నియోజకవర్గానికి ఏడుగురు సభ్యులతో వ్యూహం, ప్రచార కమిటీని ఏఐసీసీ నియ‌మించింది. కమిటీ కన్వీనర్‌గా సీనియర్‌ నేత మధుయాష్కీగౌడ్‌, సభ్యులుగా రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బలరాంనాయక్‌, దానసరి అనసూయ, అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఎస్‌ఏ సంపత్‌కుమార్‌, ఇ.అనిల్‌కుమార్‌ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాను ప్రకటించిన కొన్ని గంటల తర్వాత తెలంగాణకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్, బి. మాణికం ఠాగూర్ కమిటీని ఏర్పాటు చేశారు.

త్వరలో అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్నట్లు రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. దీంతో 2018 ఎన్నికల్లో ఆయన గెలిచిన అసెంబ్లీ సీటు ఖాళీ అవుతుంది. ఆయన బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కీల‌కం కానుంది. దుబ్బాక‌, హుజురాబాద్‌లో ఓట‌మి పాలైన కాంగ్రెస్ పార్టీ త‌న సొంత సీటుని కాపాడుకునే ప‌నిలో ఉంది.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఊహించనిది కానప్పటికీ. ఇది కాంగ్రెస్‌కు మరో దెబ్బ అని చెప్పాలి. 2018 ఎన్నికల్లో 119 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 19 సీట్లు గెలుచుకుంది. ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల తర్వాత 12మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. 2019 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలో హుజూర్‌నగర్ అసెంబ్లీ సీటును నిలుపుకోవడంలో కాంగ్రెస్ విఫ‌ల‌మైంది. 2019 ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అయితే గ‌త కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న దూరంగా ఉన్నారు. రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం ఐదుకు పడిపోయింది. కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌ల్ని మోసం చేసిన వారికి గుణపాఠం చెప్పాలని మునుగోడు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ ఇన్ చార్జి పిలుపునిచ్చారు.

గత రెండేళ్లలో జరిగిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ పుంజుకున్న నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటూ 2023లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే దూకుడుగా పని చేస్తోంది. అయితే మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు పుంజుకోవడానికి మరో అవకాశం ఇస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aicc
  • bjp
  • komatireddy rajagopal reddy
  • munugodu By elections
  • telangana congress
  • trs

Related News

Prashant Kishor To Contest

Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు.

  • Delhi High Court deals a blow to Kavitha.

    TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd