HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Telangana Bjp State President Bandi Hard Comments On Cm Kcr

Bandi: ‘ఆర్థిక పరిస్థితి’పై శ్వేత పత్రం విడుదల చేయాలి!

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా వైఫల్యం వల్ల రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

  • Author : hashtagu Date : 29-03-2022 - 10:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా వైఫల్యం వల్ల రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమని గొప్పలు చెబుతూ… రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి పూర్తిగా దివాళా తీయించారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వడం లేదు. రోజుకో జిల్లా చొప్పున వంతుల వారీగా జీతాలు చెల్లిస్తూ ప్రతి నెలా రెండోవారం దాకా సాగదీస్తున్నారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్మెంట్, ఎడ్యుకేషన్ కన్షెషన్, సరెండర్ బిల్లులు గత 7 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. చివరకు 317 జీవో ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులకు సంబంధించి జనవరి నెల వేతనం కూడా ఇంకా చెల్లించలేదంటే… రాష్ట్ర ఆర్దిక పరిస్థితి ఏ దుస్థితిలో ఉందో ఇంతకంటే నిదర్శనం ఏముందని ప్రశ్నించారు బండి సంజయ్. ఉద్యోగ, ఉపాధ్యాయులు జీపీఎఫ్ లో కూడబెట్టుకున్న డబ్బులను తమ పిల్లల ఉన్నత చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం, కుటుంబ సభ్యులకు చికిత్స చేయించుకోవాలని ఆరాట పడుతుంటే… వాటిని కూడా చెల్లించకపోవడం అత్యంత దురదుష్టకరం. జీపీఎఫ్ సొమ్ము డ్రా చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తులను గత 2 ఏళ్లుగా ఎందుకు పెండింగ్ లో పెట్టారో? సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

నిజంగా తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగుల బడ్జెట్ కలిగిన రాష్ట్రమైతే… ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతనాలకు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చింది? వాయిదాల పద్దతిలో మాదిరిగా ఒక్కోరోజు ఒక్కో జిల్లాకు చొప్పున ప్రతినెలా రెండో వారం దాకా జీతాలను చెల్లిస్తూ ఎందుకు సాగదీస్తున్నారు? అని ప్రశ్నించారు బండి. ఉద్యోగ, ఉపాధ్యాయులు 2020 జులై తర్వాత సమర్పించిన వేలాది పెండింగ్ బిల్లులను 2021 మార్చి 31 నాడు ఎందుకు తిరస్కరించింది ఈ ప్రభుత్వం?…. ఆ తరువాత 2021 నుండి సమర్పించిన పెండింగ్ బిల్లులను కూడా ఆర్దిక సంవత్సరం ముగుస్తున్నా… ఇంకా ఎందుకు చెల్లించడంలేదు. మార్చి 31 లోపు పెండింగ్ బిల్లులు పాస్ కాకపోతే పరిస్థితి ఏమిటి? అని కేసీఆర్ సర్కార్ ను నిలదీశారు బండి సంజయ్. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఎక్కడ కూడా అమలవుతున్న దాఖలాలు లేవు.

హెల్త్ కార్డులతో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్యం చేయకపోవడంతో ఉద్యోగులు నానా యాతనలు పడుతుంటే ఎందుకు స్పందించడం లేదు? ఇదేనా ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా? ఇకపై ఉద్యోగి పదవీ విరమణ చేసిన రోజే రావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ అన్ని అదేరోజు అందించి ఆనందంగా ఇంటికి పంపుతామని అసెంబ్లీ సాక్షిగా ఘనంగా ప్రకటించిన ముఖ్యమంత్రి మాటలేమయ్యాయి? ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా నెలల తరబడి ఉద్యోగికి రావలసిన బకాయిలు రాక పోవడం దారుణం అని అన్నారు బండి సంజయ్. నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా… రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులన్నీ తక్షణమే మంజూరు చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు బండి సంజయ్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • cm kcr
  • financial crisis
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd