BJP Chief: ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు.. కేసీఆర్ పై బండి ఫైర్!
- By Balu J Published Date - 04:28 PM, Wed - 12 January 22
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వివేకానందుడి విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలను మొదలుపెట్టిందని, ఏ క్షణంలోనైనా జైలుకు పోవచ్చునని జోస్యం చెప్పారు. తమిళనాడు, కేరళ, బీహార్ రాష్రాలకు చెందిన కీలక నేతలు కేసీఆర్ కలుస్తుండటం.. కేసీఆర్ థర్డ్ ప్రంట్ దిశగా అడుగులు వేస్తున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా ‘‘ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు.. దోచుకోవడం.. దాచుకోవడమే కేసీఆర్ ఎజెండా. కేసీఆర్ ఎక్కడున్నా లాక్కొస్తాం. ఫాం హౌస్ లో వెళ్లి పడుకునే నేత దేశ రాజకీయాల్లోకి వెళ్లి ఏం చేస్తారు?’’ అని సంజయ్ మండిపడ్డారు.