Suicide: ఓయూ క్యాంపస్ లో విద్యార్థి ఆత్మహత్య.. కారణమేంటో చెప్పిన పోలీసులు..?
తెలంగాణ రాష్ట్ర EAMCET-2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయినందుకు 18 ఏళ్ల విద్యార్థి గురువారం ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు.
- By Gopichand Published Date - 07:31 AM, Fri - 26 May 23

Suicide: తెలంగాణ రాష్ట్ర EAMCET-2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయినందుకు 18 ఏళ్ల విద్యార్థి గురువారం ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్-ఎమ్సెట్) ఫలితాలు గురువారం వెలువడిన విషయం తెలిసిందే. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు
ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. విద్యార్థిని కాలిపోతున్న స్థితిలో ఓ వ్యక్తి నగర పోలీసులకు సమాచారం అందించాడు. విద్యార్థిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Bride Cancel Marriage: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. వెంటనే తాళి తెంపి అలా?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ నల్లకుంటకు చెందిన కె.శ్రీకృష్ణ చైతన్య (18) ఓ ప్రైవేట్ కళాశాలలో చదివి ఎంసెట్‌కు పరీక్షకు హాజరయ్యాడని పోలీసులు తెలిపారు. ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయినందుకు చైతన్య తన సైకిల్‌పై పెట్రోల్ బాటిల్‌తో ఓయూ క్యాంపస్‌కు వచ్చి నిప్పంటించుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు అని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపారు.
ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య
ఇటీవల తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్‌బీఐఈ) ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు, నిజామాబాద్‌కు చెందిన ఒక విద్యార్థితో సహా ఆరుగురు విద్యార్థులు ఫలితాలు వెలువడిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు బాలికలు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

Related News

Telangana: అర్చకులకు సీఎం కేసీఆర్ తీపి కబురు.. గౌరవభృతి పెంపు
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అర్చకులకు తీపి కబురు అందించారు. వేదశాస్త్ర పండితులకు తెలంగాణ ప్రభుత్వం నెల నెల గౌరవభవృతి 2,500 అందిస్తున్న విషయం తెలిసిందే.