HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Team India Team Announcement For Odi Against Australia Who Is The Captain

ODI: ఆస్ట్రేలియాతో వన్డేకు టీఇండియా జట్టు ప్రకటన… కెప్టెన్‌ ఎవరంటే?

కంగారులతో జరిగే మూడు, నాలుగు టెస్టులకు, వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించేసింది. జట్టు ఫాంలో ఉండడంతో తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన టీమ్‌నే కొనసాగించింది.

  • Author : Anshu Date : 19-02-2023 - 9:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whatsapp Image 2023 02 19 At 21.13.29
Whatsapp Image 2023 02 19 At 21.13.29

ODI: కంగారులతో జరిగే మూడు, నాలుగు టెస్టులకు, వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించేసింది. జట్టు ఫాంలో ఉండడంతో తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన టీమ్‌నే కొనసాగించింది. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్‌ వంటి ప్లేయర్లకు చోటు దక్కుతుందని అందరూ భావించగా మరోసారి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కూ జట్టుకు ఎంపిక చేసింది. రవీంద్ర జడేజా వన్డే టీమ్‌లోకి కూడా రీఎంట్రీ ఇవ్వగా.. జయదేవ్ ఉనద్కత్‌కు కూడా బీసీసీఐ చోటు కల్పించింది. మొదటి వన్డేకు రోహిత్ శర్మ దూరం అవ్వగా.. హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పేర్కొంది.

మొదటి వన్డేకు రోహిత్ శర్మ కెప్టెన్సీని చేపట్టడని బీసీసీఐ వెల్లడించింది. ఇది ఒక కీలక పరిణామంగా చెప్పవచ్చు. కుటుంబ కారణాల వల్ల తొలి వన్డేకు దూరమయ్యాడని.. హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తాడని తెలిపింది. టెస్టుల్లో అదరగొట్టిన అశ్విన్‌కు వన్డే జట్టులో చోటు కల్పించలేదు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌లకు జట్టులో అవకాశం కల్పించారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య తొలి వన్డే మార్చి 17న ముంబైలో జరగనుంది. రెండో వన్డే మార్చి 19న విశాఖపట్నంలో, చివరిదైన మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరగనుంది. అంతకుముందు మార్చి 1 నుంచి ఇండోర్‌లో మూడో టెస్టు మ్యాచ్, నాలుగో టెస్టు మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో జరగనున్నాయి.

చివరి రెండు టెస్టులకు టీమిండియా టీం.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఎస్.గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్.అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఆర్.జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్ , సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • BCCI
  • ODI
  • one day international
  • team india

Related News

BCCI Announces IPL 2026 Playoffs schedule

IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఉత్కంఠభరితంగా సాగే ఈ టోర్నీ ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం అధికారికంగా విడుదల చేసింది. ఈసారి గ్రాండ్ ఫైనల్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 31న తుదిపోరు జరగనుంది. 70 లీగ్ మ్యాచ్‌ల తర్వాత ప్రారంభమయ్యే ప్లేఆఫ్స్ పోరులో భాగంగా మే 26న ధర్మశ

    Latest News

    • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

    • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

    • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

    • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

    • Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd