Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య
- Author : Vamsi Chowdary Korata
Date : 17-10-2025 - 12:39 IST
Published By : Hashtagu Telugu Desk
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజకీయాల్లో కీలక మైలురాయిని చేరుకున్నారు. గుజరాత్‌లో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో ఆమెకు స్థానం లభించింది. నేడు జరిగిన కేబినెట్ విస్తరణలో ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
కొంతకాలంగా గుజరాత్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న రివాబా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కీలక పాత్ర పోషించనున్నారు. ఒక ప్రముఖ క్రికెటర్ భార్య రాష్ట్ర కేబినెట్‌లో మంత్రి కావడం జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నియామకంతో ఆమె రాజకీయ ప్రస్థానం మరో ఉన్నత స్థాయికి చేరినట్లయింది.
రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కడం పట్ల ఆమె మద్దతుదారులు, రవీంద్ర జడేజా అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లోనూ రాణించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.