Harassment : టెన్త్ విద్యార్థినిపై ఉపాధ్యాయుడి లైగింక వేధింపులు
విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన పాఠశాల ఉపాధ్యాయుడిని విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని వంగర
- Author : Prasad
Date : 09-08-2023 - 8:29 IST
Published By : Hashtagu Telugu Desk
విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన పాఠశాల ఉపాధ్యాయుడిని విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని వంగర జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిని సైన్స్ ఉపాధ్యాయుడు కె.రాము వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అతను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడని.. తన మొబైల్ ఫోన్‌తో కొన్ని ఫోటోలను కూడా చిత్రీకరించాడని సమాచారం. అనంతరం ఆ ఫొటోలను బాలికకు చూపించి శారీరక సంబంధం పెట్టుకోవాలని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించాడు. అతని వేధింపులతో విసిగిపోయిన ఆమె చివరకు దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు వంగరకు చేరుకుని.. రాము మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉపాధ్యాయుడు రాముపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ 354-ఏ, 386, ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.