Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించిన మహిళలు..!
మాజీ మంత్రి కొడాలి నాని క్షమాపణ చెప్పాలంటూ గుడివాడలో తెలుగు మహిళలు డిమాండ్ చేశారు.
- By Prasad Published Date - 03:15 PM, Tue - 6 September 22

మాజీ మంత్రి కొడాలి నాని క్షమాపణ చెప్పాలంటూ గుడివాడలో తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించిన తెలుగు మహిళలను పోలసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. పలువు మహిళా టీడీపీ నాయకురాలను పోలీసులు అరెస్ట్ చేశారు.మహిళలను కించపరిచిన కొడాలి నాని క్షమాపణ చెప్పాలంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కొడాలి నాని కు వ్యతిరేకంగా పెద్దఎత్తున తెలుగు మహిళలు నినాదాలు చేశారు.