HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tdp Has No Representation In Rajya Sabha

TDP: రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేనట్టేనా?

  • Author : Balu J Date : 08-02-2024 - 9:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

TDP: ప్రస్తుతం టిడిపికి ఒకే ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. ఆయనే కనకమెడల రవీంద్ర. వచ్చే నెలలో ఆయన రిటైర్ కానున్నారు. దీంతో రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేనట్టే. ప్రస్తుతం ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెలాఖరున ఓటింగ్ జరగనుంది. అయితే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.గత ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి అనూహ్య విజయం దక్కించుకున్నారు.

మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా.. చివరి స్థానానికి టిడిపి అభ్యర్థిని నిలిపింది. అప్పటికే నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించారు. కానీ అనూహ్యంగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలుపొందారు. సరిగ్గా ఇటువంటి ఫలితమే రాజ్యసభ ఎన్నికల్లో రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే టిడిపి అభ్యర్థిని ప్రకటించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అది అంత సులువు అయ్యే పని కాదని తేలుతోంది. ఒకవైపు సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.

రాజ్యసభ స్థానం దక్కించుకోవాలంటే దాదాపు 45 ఓట్లు అవసరం. ప్రస్తుతం టిడిపికి ఉన్న బలం 18 మంది ఎమ్మెల్యేలు. ఈ లెక్కన మరో 27 మందిని ఆకర్షించాలి. అది అయ్యే పనియేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తప్పకుండా విప్ జారీ చేస్తుంది. పార్టీ ఏజెంట్ కు చూపి ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ముందుకు వచ్చేది ఎంతమంది? వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతోంది. సిట్టింగ్లను మార్చడంతో జగన్ పై ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. కానీ వారు రాజకీయంగా విభేదిస్తారా? లేదా? అన్నది తెలియాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap political
  • rajyasabha
  • tdp

Related News

APs Development

ఎంత రెచ్చగొట్టిన కాపులు సైలెంట్ గా ఉంటున్నారా ? వైసీపీ ప్లాన్ వర్క్ కావడం లేదా ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా అంబటి రాంబాబు వంటి వారు చేస్తున్న వ్యాఖ్యలు, ముద్రగడ పద్మనాభం రాసిన బహిరంగ లేఖలు కాపు సామాజికవర్గంలో సెగ పుట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది

  • Ambati Rambabu Son in Law Upesh

    చంద్రబాబు మీద అనుచిత వాక్య పై మా మామ అంబటి రాంబాబు బాధపడుతున్నారు: అల్లుడు ఉపేష్

Latest News

  • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. బోణీ కొట్టిన టీమిండియా!

  • మరణానికి ముందు కనిపించే సంకేతాలివే!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ నుంచి రెండో సాంగ్‌.. అప్డేట్ ఇదే!

  • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

Trending News

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

    • టీ20 వరల్డ్ కప్‌.. తొలి మ్యాచ్‌కు ఈ ఆట‌గాళ్లు ఎందుకు దూర‌మ‌య్యారు?

    • ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!

    • భార‌త్ రూ. 725 కోట్ల రూపాయల భారీ డీల్..!

    • ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd