Delhi Excise Policy Case: ముగిసిన కేజ్రీవాల్ కస్టడీ.. ఈ రోజు సుప్రీం విచారణ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీ అతన్ని రోస్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనుంది.
- By Praveen Aluthuru Published Date - 09:21 AM, Mon - 15 April 24

Delhi Excise Policy Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీ అతన్ని రోస్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనుంది. ఏప్రిల్ 1న ఈడీ డిమాండ్ మేరకు, ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా, కేజ్రీవాల్‌ను 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలుకు పంపిన విషయం తెలిసిందే.
జ్యుడీషియల్ కస్టడీ ముగిసిన తర్వాత కేజ్రీవాల్ కోర్టుకు హాజరుకానున్నారు. అయితే ఢిల్లీ హెచ్‌సి నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అంతకుముందు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీపై సీఎం వ్యతిరేకించకపోగా.. తన అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరిస్తూ హైకోర్టు తీర్పు ఇస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join
విచారణ సందర్భంగా కేజ్రీవాల్ దర్యాప్తు సంస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈడీ వాదించింది. కేజ్రీవాల్ అత్యంత ప్రభావశీలి అని, ఆయనను విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేయడంతోపాటు సాక్ష్యాలను తారుమారు చేయవచ్చని ఈడీ పేర్కొంది. మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్‌కు ఈడీ రెండుసార్లు పది రోజుల రిమాండ్ విధించింది.